గాలివాన బీభత్సం.. వంద ఎకరాల్లో పంటనష్టం | - | Sakshi
Sakshi News home page

గాలివాన బీభత్సం.. వంద ఎకరాల్లో పంటనష్టం

Mar 20 2026 8:17 AM | Updated on Mar 20 2026 8:17 AM

చౌడేపల్లె: మండలంలో బుధవారం రాత్రి గాలీవాన బీభత్సం సృష్టించింది. పెనుగాలులతో కూడిన భారీ వర్షానికి బత్తలాపురం రోడ్డులోగల మారెమ్మ ఆలయం సమీపంలో విద్యుత్‌ స్తంభం నేలకొరిగింది.అలాగే వడగండ్ల వర్షంతో టమోటా పంటలకు నష్టం జరిగింది. గాలీవానతో ఖాన్‌సాబ్‌ మిట్ట నూరుల్లా కు చెందిన బీర తోట నేలకొరికింది. కట్టెలకు బీర తీగలు అల్లించడంతో వానకు గాలికి కట్టెలు విరిగి కుప్పకూలాయి. పంట దిగుబడి చేతికందే సమయంలో అకాల వర్షం అతలాకుతలం చేసిందని సుమారు రూ:లక్ష మేర ఆస్థినష్టం వాటిల్లినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి పిందెలు సైతం పెనుగాలులకు రాలిపోయాయి. సుమారు 100 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement