మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్‌లు ఢీకొని ముగ్గురు యువకులు మృతి చెందారు. మండలంలోని సర్కారు తోపు వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోగా, మరో యువకుడిని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను కూడా చనిపోయాడు. సమాచారం అందుకున్న ముదివేడు పోలీసులు ఘటన స్థలం వద్దకు చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రి మార్చరీకి తరలించారు. మృతుల్లో బి.కొత్తకోటకు చెందిన సురేష్, మదనపల్లెలోని చంద్రకాలనీకి చెందిన మాధవ, మహేష్‌లుగా పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


