వాల్మీకిపురం: వాల్మీకిక్షేత్రంలోని శ్రీరాముడి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిద్దామని టీటీడీ డిప్యూటీ ఈవో వరలక్ష్మి అన్నారు. బుధవారం స్థానిక పట్టాభిరామాలయంలో టీటీడీ అధికారులు, అర్చకులతో కలసి వార్షిక బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల 23 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతాయన్నారు. అలాగే 29న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం , 30వ తేది రథోత్సవం, 2వ తేది పుష్పయాగంతో ఉత్సవాలు ముగియనున్నాయి. ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని, స్వామి వారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయా లని ఆమె కోరారు. టీటీడీ అధికారులు, అర్చకులు క్రిష్ణస్వామి, భాషికాచార్యులు, రాంగోపాల్, మురళీ, సిబ్బంది నాగరాజ, తదితరులు పాల్గొన్నారు.


