దివ్యాంగులకు ఉచిత ప్రయాణం | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగులకు ఉచిత ప్రయాణం

Mar 19 2026 7:50 AM | Updated on Mar 19 2026 7:50 AM

మదనపల్లె: ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం దివ్యాంగులకు వరమని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ అన్నారు. బుధవారం ఆయన స్థానిక ఆర్టీసీబస్టాండ్‌లో దివ్యాంగశక్తి పథకాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే షాజహాన్‌బాషాతో కలిసి బస్సుకు పచ్చజెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్‌ ఉచిత టికెట్‌ను అందించి బస్సులో ప్రయాణించి దివ్యాంగులతో ముచ్చటించారు. వారి సమస్యలను, అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. జిల్లాలో వీరు 42,560 మంది ఉన్నారని వెల్లడించారు. డిపో మేనేజర్‌ అమరనాథ్‌, వెలుగు సెక్రటరీ ఎం.ఉదయ్‌మోహన్‌రెడ్డి, దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మౌలాలి పాల్గొన్నారు.

కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement