సదుం : స్థానిక పంచాయతీ వనరులకు బుధవారం బహిరంగ వేలం నిర్వహించారు. ఇందులో వారపుసంతను మనోజ్‌కుమార్ రూ.16.30 లక్షలకు దక్కించుకున్నారు. అలాగే దినసరి మార్కెట్ రూ.60, 500, ప్రైవేట్ బస్టాండు రూ.68 వేలు, పూలమార్కెట్ రూ.73, 500, జంతువధ శాల రూ.4 వేలు పలికాయి. గతేడాది కంటే సుమరు రూ.6 లక్షల అదనపు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ రాధారాణి, ఎస్‌ఐ విష్ణునారాయణ, సర్పంచ్ ఉషారాణి, వైస్ సర్పంచ్ బాబు రెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ నాగరాజు, పీడీఓ చలపతి పాల్గొన్నారు.


