నెలవంక కోసం.. ఆకాశం వంక | - | Sakshi
Sakshi News home page

నెలవంక కోసం.. ఆకాశం వంక

Mar 19 2026 7:45 AM | Updated on Mar 19 2026 7:45 AM

మదనపల్లె సిటీ : రోజంతా కఠిన ఉపవాసం.. దైవంపైనే మనసు లగ్నం.. పవిత్ర ఖురాన్‌ పఠనం, శ్రవణం..తోటివారిపై ప్రేమ, సోదరభావం, పేదలపై దయ,కరుణ,దాన,ధర్మాలు... ఇలా శుభాల వసంతం రంజాన్‌ మాసమంతా ముస్లింలు నియమ నిష్టలు.దైవ చింతనతో గడిపారు. నెల రోజుల పాటు సహరీ, ఇఫ్తార్‌, తరావీ ప్రార్థనల్లో లీనమైన ముస్లింలు గురువారం సాయంత్రం షవ్వాల్‌ నెలవంక కోసం ఆకాశం వంక వేయికళ్లతో ఎదురు చూస్తారు. ఇఫ్తార్‌ సమయంలో పేలే బాణాసంచా మందు భానుడు పశ్చిమ సంద్రంలో మునిగే సమయంలో అందరి చూపు ఆశాశం వైపే ఉంటుంది. ఆకాశంలో నీలిమేఘాల మాటు నుంచి మబ్బు తెరలు తొలగించుకుని అరసున్న ఆకారంలో కనిపంచే షవ్వాల్‌ నెల వంక కోసం అందరూ వెతుకుతారు. నీటిమేఘాల మాటు నుంచి అరుణాచల కాంతులతో వెలిగే అర్థ ఆకార చంద్రుడు..కనిపించగానే అందరితో పూర్ణానందం వెల్లిరిస్తుంది. ‘ఈద్‌ కా చాంద్‌ నజర్‌ ఆగయా...సబ్‌ కో ఈద్‌ ముబారక్‌ అంటూ ఒకరినొకరు అలింగనం చేసుకుని, ఈద్‌ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అంబరాన్నంటే సంబరాలు చేసుకుంటారు.

ఈద్గా, మసీదులు ముస్తాబు

ఈద్‌ ప్రార్థనలు కోసం జిల్లాలోని మదనపల్లె, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, పీలేరు, వాల్మీకిపురం, గుర్రంకొండ, బి.కొత్తకోట ప్రాంతాల్లోని ఈద్గాలు, మసీదులు ముస్తాబవుతున్నాయి. మరో వైపు ముస్లింలు సోదరులు ఇంటిల్లిపాది కొత్తగా కొనుగోలు చేసిన దుస్తులను చూసి మురిసిపోతున్నారు. ఆడపడుచులు బిరియానీ మసాలాల తయారీలో లీనవుతున్నారు. చిన్నారులు తమ చేతులను మెహందీలతో అలంకరించుకుంటున్నారు.

నెలవంక దర్శనంతోనే నిర్ణయం

షాబాన్‌ నెల 30వ రోజున రంజాన్‌ నెలవంక దర్శనంతో ఉపవాసదీక్షను ప్రారంభించడం, 30 రోజుల అనంతరం షవ్వాల్‌ నెలవంక దర్శనంతో ఉపవాసదీక్షలను ముగించి ఈదుల్‌ఫితర్‌ పండుగను జరుపుకోవడంలోనూ నెలవంక దర్శనమే కీలకం, చాలా సందర్భాల్లో రంజాన్‌ నెల వంక వాతావరణ ప్రభావంతో కనిపించనప్పుడు మతగురువులు ముఖ్యంగా ప్రభుత్వ సర్‌ఖాజీలు,హాఫీజ్‌సాహెబ్‌ సమావేశమై రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల ముఫ్తీలు, హిలాల కమిటీలతో సమన్వయం చేసుకుని చంద్రుని దర్శన సమాచారం తెప్పించుకుంటారు. వారి నిర్ణయంతోనే రంజాన్‌ పండుగ నిర్ణయిస్తారు. గురువారం నెలవంక దర్శనమైతే శుక్రవారం పండుగ జరుపుకుంటారు.

లైలతుల్‌ జాయెజా

పవిత్ర రంజాన్‌ మాసం ముగింపు సందర్భంగా షవ్వాల్‌ నెలవంక దర్శనం అనంతరం ఆ రోజు రాత్రిని లైలతుల్‌ జాయోజాగా వ్యవహరిస్తారు. మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. మసీదుల్లో ముస్లింలు ఎక్కువ సంఖ్యలో చేరి దైవ ప్రార్థనలు చేస్తారు. ఎక్కువ సమయం దివ్యఖురాన్‌ పారాయణం, శ్రవణంతో గడుపుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement