దుఃఖాన్ని దిగమింగి పరీక్షకు.. | - | Sakshi
Sakshi News home page

దుఃఖాన్ని దిగమింగి పరీక్షకు..

Mar 19 2026 7:45 AM | Updated on Mar 19 2026 7:45 AM

పరీక్ష రాయడానికి వెళుతున్న విద్యార్థిని కోమల

తండ్రి మృతదేహం వద్ద విలపిస్తున్న కోమల

రామసముద్రం : ఓ వైపు పదోతరగతి పరీక్షలు ప్రారంభం.. మరోవైపు తండ్రి మరణంతో పుట్టెడు దుఃఖంలోనూ విద్యార్థిని పరీక్ష రాసిన ఘటన రామసముద్రంలో చోటుచేసుకుంది. వివరాలు..

రామసముద్రం కరుణాల వీధికి చెందిన పార్లపల్లి శ్రీనివాసులు (45) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటివల అనారోగ్యం ఎక్కువ కావడంతో బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. శ్రీనివాసులుకు ఇద్దరు కుమార్తెలు. రెండో అమ్మాయి కోమల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం కెమిస్ట్రీ పరీక్ష ఉంది. తండ్రి మృతదేహం ఇంటి వద్ద ఉండగా ఆ బాలిక పరీక్షకు హాజరైంది. విషాదంలోనూ ధైర్యంగా పరీక్ష రాసిన కోమలపై అధ్యాపకులు, సహా విద్యార్థులు, స్థానికులు సానుభూతి వ్యక్తం చేశారు. బాలిక పరీక్ష పూర్తయ్యాక కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయం స్థానికులను. ఎంతగానో కలిచివేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement