సదుం : ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో బుధవారం జరగింది. స్థానికుల కథనం మేరకు.. కంభంవారిపల్లె పంచాయతీ గాండ్లపల్లెకు చెందిన మోహన్‌బాబు (26) వ్యవసాయ పొలం వద్ద మోటర్ మరమ్మతులకు మంగళవారం సాయంత్రం వెళ్లాడు. మరమ్మతులు చేస్తుండగా పక్కనే ఉన్న బావిలో ప్రమాదవశాత్తు పడి మృతిచెందాడు. స్థానికులు ఉదయం గుర్తించి మృతదేహాన్ని వెలికి తీశారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రైలు కిందపడి
గుర్తుతెలియని వ్యక్తి...
కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లాలోని భాకరాపేట – ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ల మధ్యగల మాధవరం వద్ద బుధవారం సుమారు 40 సంవత్సరాల వయసు గల వ్యక్తి రైలు కిందపడి మృతి చెందాడని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతుడి ఆచూకీ, మృతికి గల కారణాలపై విచారణ చేస్తున్నామన్నారు. మృతుడు సిమెంట్ కలర్ ఫుల్ షర్టు, నల్ల లుంగీ ధరించి ఉన్నాడన్నారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు కడప రైల్వే పోలీసులు 9247575623, 9247575624 నంబర్లకు తెలియజేయాలన్నారు.


