పీజీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

పీజీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Mar 17 2026 7:36 AM | Updated on Mar 17 2026 7:36 AM

పీజీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం పోటాపోటీగా వేలం పాట ఫిజియోథెరపిస్టుల నియామకం

కడప ఎడ్యుకేషన్‌: ఆంధ్రప్రదేశ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీపీజీసెట్‌)–2026 నకు ఈనెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని యోగి వేమన విశ్వవిద్యాలయ ప్రవేశాల సంచాలకులు డాక్టర్‌ టి. లక్ష్మిప్రసాద్‌ తెలిపారు. డిగ్రీ ఇప్పటికే పూర్తి చేసుకున్న వారు చివరి సంవత్సరం పరీక్షలు రాయబోయే వారు ఈ వెబ్‌సైట్‌ https://cets. apsche.ap.gov.inను క్లిక్‌ చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు పొందగోరే విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. వైవీయూలో 29 కోర్సులు ఉన్నాయని ఆయా అర్హతలను బట్టి ఎంపిక చేసుకోవాలన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే డాక్టర్‌ పి లక్ష్మిప్రసాద్‌ సెల్‌ నెంబర్‌ (8317532040)ను, డాక్టర్‌ సరిత (81066 04789)లను సంప్రదించాలని సూచించారు.

హుండీ ఆదాయం లెక్కింపు

బ్రహ్మంగారిమఠం: బి.మఠంలో ఉన్న శ్రీమాతా ఈశ్వరీదేవి మఠంలో సోమవారం హుండీల ఆదాయాన్ని లెక్కించగా రూ 5,09,041 నగదు వచ్చిందని మఠం ఈఓ బివీ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. అలాగే తలనీలా కోసం వేలం వేయగా రూ 71వేలు ఆదాయం వచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో ఈశ్వరీదేవిమఠం మఠాధిపతి శివకుమారస్వామి, మఠం సిబ్బంది పాల్గొన్నారు.

కురబలకోట: మండలంలోని అంగళ్లు గ్రామంలో సోమవారం నిర్వహించిన టమోటా మార్కెట్‌, గొర్రెల సంత, వారపు సంత గేటు వసూళ్లకు సంభంధించి పంచాయతీ కార్యాలయంలో జరిగిన వేలంపాటలు పోటాపోటీగా సాగాయి. పారదర్శకంగా నిర్వహించిన ఈ వేలం పాటలకు వ్యాపారులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. డీఎల్పీవో నాగరాజు, ఎంపీడీవో గంగయ్య, డిప్యూటి ఎంపీడీఓ బాలమూర్తి, పంచాయతీ కార్యదర్శి ఉదయ్‌కుమార్‌, అంగళ్లు సర్పంచ్‌ పోరెడ్డి విశ్వనాథ్‌రెడ్డిల సమక్షంలో వేలంపాటలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో టమోటా మార్కెట్‌ సంతగేటు వసూళ్ళను అంగళ్ళు గ్రామానికి చెందిన తోట అశోక్‌కుమార్‌ రూ.44.50 లక్షలకు దక్కించుకున్నారు. గొర్రెల సంత గేటు వసూళ్లను పీ.ద్వారకనాథ్‌రెడ్డి రూ.53.30 లక్షలకు, వారపు సంత గేటు వసూళ్లను జంగా హరినాథ్‌రెడ్డి రూ.8.10 లక్షలకు దక్కించుకున్నారు. ఈ మూడు సంతల వేలం పాటల ద్వారా గ్రామ పంచాయతికి రూ.1,05,81,000ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెళ్లడించారు.

మదనపల్లె సిటీ: జిల్లా సమగ్రశిక్షలోని 15 మండలాల భవిత కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 5 ఫిజియోథెరపిస్టుల పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసినట్లు జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ డాక్టర్‌ అనూరాధ తెలిపారు. సోమవార సమగ్రశిక్ష కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపికై న అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 32 మంది అభ్యర్థులు పోస్టులకు దరఖాస్తు చేసుకోగా ప్రతిభ ఆధారంగా ఎంపికై నవారు బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. జయశ్రీ (చిట్వేలు, పెన గలూరు, నందలూరు), బి.సునీల్‌నాయక వాల్మీకిపురం, కలికిరి, రామసముద్రం), కోమల (కురబలకోట, కెవి.పల్లి, కలకడ) మమతరాణి (బి.కొత్తకోట, పీటీఎం, ములకలచెరువు), హరీష్‌కుమర్‌రాజు (ఎంఆర్‌ పల్లి, రామాపురం ,రాజంపేట)భవిత కేంద్రాలను కేటాయించినట్లు తెలిపారు. సహిత విద్య కోఆర్డినేటర్‌ జనార్థన్‌, సీఎంవో కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement