ఖురాన్‌ బోధనలు మానవాళికి ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

ఖురాన్‌ బోధనలు మానవాళికి ఆదర్శం

Mar 17 2026 7:36 AM | Updated on Mar 17 2026 7:36 AM

ఖురాన్‌ బోధనలు మానవాళికి ఆదర్శం

మదనపల్లె సిటీ: దివ్య ఖురాన్‌ బోధనలు మానవాళికి ఆదర్శమని సర్‌ఖాజీ మౌలానా జలాలుద్దీన్‌సాహెబ్‌ అన్నారు. రంజాన్‌ మాసంలోని 27వ రాత్రిని పురస్కరించుకుని ముస్లిం సోదరులు షబే ఖదర్‌ పర్వదినాన్ని సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు భక్తశ్రదద్ధలతో జరుపుకున్నారు. పట్టణంలోని జామియా మసీదు,మోతీ మసీదు, మక్కా మసీదు, మదీనా మసీదు, ఉస్మానియా మసీదు ,మహమ్మదీయ మసీదులతో పాటు రూరల్‌ పరిధిలోని ఆరోగ్యవరం, సీటీఎం, బండికందపల్లెలోని మసీదుల్లో షబే ఖదర్‌ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్థానిక జామియా మసీదులో ప్రభుత్వ సర్‌ఖాజీ మౌలానా జలాలుద్దీన్‌ ధార్మికోపన్యాసం చేశారు. దివ్య ఖురాన్‌ అవతరించిన మహోన్నత రేయి షబేఖదర్‌ అన్నారు. దివ్యఖురాన్‌ భోదనల ప్రకారం అందరూ నడుచుకుని ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించాలన్నారు. ముఖ్యంగ పవిత్ర రంజాన్‌మాసంలో ఫిత్రా ,జకాత్‌ రూపంలో పేదలను ఆదుకోవాలన్నారు. షబేఖదర్‌ సందర్భంగా మసీదులన్నీ విద్యుత్‌దీపాలకాంతుల్లో ధగదగలాడాయి.

షబే–ఏ–ఖదర్‌ ప్రత్యేక ప్రార్థనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement