రామసముద్రం : రామసముద్రం మండలంలోని పెద్దకురపల్లి పంచాయతీ తిరుమలరెడ్డి పల్లి గ్రామానికి చెందిన ఆకుతోట సుధారాణి (29) మనస్తాపానికి గురై చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ ఉమామహేశ్వర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సుధారాణి ఫోన్లో మాట్లాడుతుండగా భర్త వెంకటరమణ గమనించి ఫోన్ లాక్కొని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లోని గదిలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు.
కారు దగ్ధం
పులివెందుల రూరల్ : పట్టణంలోని స్థానిక జేఎన్‌టీయూ కళాశాల వెనుకవైపు ఉన్న జగనన్న కాలనీలో గుర్తు తెలియని కారు దగ్ధమైంది. కారు దగ్ధమై సుమారు 10రోజులై ఉంటుందని ఆ ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు. కారును ఎవరు దగ్ధం చేసి ఉంటారు, ఎందుకు చేసి ఉంటారో తెలియాల్సి ఉంది.
కారు బోల్తా: ఒకరికి గాయాలు
పులివెందుల రూరల్ : పట్టణంలోని జగనన్న కాలనీకి వెళ్లే రోడ్డులో సోమవారం అర్ధరాత్రి కారు బోల్తా పడింది. ఈ సంఘటనలో కారు డ్రైవర్ హరీష్‌కు గాయాలయ్యాయి. పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఒక సెల్ పాయింట్‌లో మేనేజర్ గా పనిచేస్తున్న హరీష్ జగనన్న కాలనీకి వెళ్లే రహదారిలో వేగంగా వెళుతూ రాయి ఎక్కడంతో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో హరీష్ గాయపడ్డాడు.


