టీడీపీ – జనసేన నాయకుల బాహాబాహీ | - | Sakshi
Sakshi News home page

టీడీపీ – జనసేన నాయకుల బాహాబాహీ

Mar 17 2026 7:36 AM | Updated on Mar 17 2026 7:36 AM

పులిచెర్ల(కల్లూరు)– మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో.. సోమవారం అందరూ చూస్తుండగా టీడీపీకి చెందిన 106 రామిరెడ్డిగారిపల్లెకు చెందిన సర్పంచ్‌ అనిత భర్త గోపీనాథ్‌రెడ్డి.. అదేగ్రామానికి చెందిన జనసేన మండపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు బాహాబాహీకి దిగారు. ఆఫీసు సిబ్బంది సమక్షంలోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.అక్కడున్న కొందరు దీనిని వీడియో తీయడంతో అదికాస్త వైరల్‌గా మారి అందరికీ తెలిసింది.జనసేన నాయకుడు చంద్రబాబుపై స్థానిక టీడీపీ సర్పంచ్‌ భర్త గోపీనాథ్‌ స్థానిక వీఆర్‌ఓతో ఏదేదో అసభ్యకరంగా అన్నాడనిచెప్పగా.. దీనిపై నువ్వు విన్నావా అని గోపీ, చంద్రబాబును అడగడంతో మాటామాటా పెరిగింది. అందరూ చూస్తుండంగానే చెప్పుతో కొట్టుకోవడం వరకు వెళ్లింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement