బైక్‌లు ఢీ: ఒకరు మృతి | - | Sakshi
Sakshi News home page

బైక్‌లు ఢీ: ఒకరు మృతి

Mar 16 2026 7:34 AM | Updated on Mar 16 2026 7:34 AM

పుంగనూరు : మండలంలోని భీమగానిపల్లె సమీపంలో ఉన్న శ్రీకృష్ణదేవరాయుల విగ్రహం కూడలిలో ఆదివారం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. పట్రపల్లెకి చెందిన సుబ్బిరెడ్డి(65) పుంగనూరుకు సొంత పనులపై బైక్‌లో వస్తుండగా, పుంగనూరు నుంచి మదనపల్లెకు ద్విచక్రవాహనంలో వెళ్తున్న ఎన్‌ఎస్‌.పేటకు చెందిన నజీర్‌(35 ) నదీమ్‌ (30) భీమగానిపల్లె సర్కిల్‌ వద్దకు రాగానే ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో సుబ్బిరెడ్డి అక్కడేక్కడే మృతి చెందాడు. గాయపడిన వారిని స్థానికులు 108లో ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించారు. ఈ మేరకు పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మేసీ్త్ర అదృశ్యంపై కేసు నమోదు

మదనపల్లెటౌన్‌ : మదనపల్లెలో మేసీ్త్ర అదృశ్యంపై పోలీసులు కేసు నమోదుచేశారు. టూటౌన్‌ పోలీసుల కథనం మేరకు.. స్థానిక ఎస్‌బీఐ కాలనీలో నివాసం ఉంటున్న మారెప్ప కుమారుడు ఎస్‌.సోమశేఖర్‌ (34), మేసీ్త్ర పనులు చేసేవాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఇంటి నుండి పనుల నిమిత్తం వెళ్లిన సోమశేఖర్‌ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు పలుచోట్ల గాలించారు.ఆచూకీ లభించక పోవడంతో చేసేది లేక సోమశేఖర్‌ భార్య సోను టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు రెండో పట్టణ ఎస్‌ఐ నాగేశ్వరరావు తెలిపారు.

మామిడి తోటలోకి

దూసుకెళ్లిన కారు

లక్కిరెడ్డిపల్లె : రాయచోటి–వేంపల్లె జాతీయ రహదారి మార్గంలోని మద్దిరేవుల వంక సమీపంలో ఆదివారం రాత్రి బోయకొండ నుంచి వేంపల్లెకు వెళతున్న కారు అదుపుతప్పి మామిడి తోటలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. స్థానికులు గమనించి కారులో ఇరుక్కున్న ఇద్దరిని బయటికి తీయడంతో ప్రమాదం తప్పింది. బ్రిడ్జ్‌కి అటువైపు ఇటువైపు ఎటువంటి ప్రమాద సూచిక బోర్డులు లేకపోవడంతో బ్రిడ్జి వద్ద పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.

డిగ్రీ విద్యార్థి అదృశ్యం

వేంపల్లె : వేంపల్లెలోని స్థానిక బలిజ సంఘం వీధికి చెందిన నామా వెంకట పూజిత్‌ అనే డిగ్రీ విద్యార్థి అదృశ్యమైనట్లు విద్యార్థి తల్లిదండ్రులు శ్రీనువాసులు, హేమలత తెలిపారు. వెంకట పూజిత్‌ కడప నగరంలోని ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శనివారం వేంపల్లె నుంచి కళాశాలకు వెళుతున్నానని ఉదయం 7 గంటలకు తల్లిదండ్రులకు చెప్పి వెళ్లిన విద్యార్థి ఆదివారం కూడా ఇంటికి రాలేదు. తల్లిదండ్రులకు చెందిన వాట్సాప్‌లో తాను ఇంటికి రాను, ఇంట్లో వాళ్లు చెబుతున్న పనులు చేయలేనని మెసేజ్‌ పంపినట్లు తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈమేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement