గుర్రంకొండ : మండలంలోని తరిగొండలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శనివారం టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. వేకువజామున స్వామివారికి అభిషేకాలు జరిపారు. తోమాలసేవ, ఏకాంత సేవ కావించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికు చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు.
మామిడి తోటకు నిప్పు
చౌడేపల్లె : మండలంలోని 29 ఏచింతమాకులపల్లె పంచాయతీ ఖాన్‌సాబ్‌మిట్టకు చెందిన అన్సర్‌బాషాకు చెందిన మామిడితోట కంచెకు శనివారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు మామిడి తోట చుట్టూ వ్యాపించడంతో గుర్తించిన రైతు పుంగనూరు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు ఆధ్వర్యంలో వారు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. వాహనం వెళ్లడానికి దారిలేకపోవడంతో ఫైర్ బీటర్స్, గ్రామస్తులు కలిసి మంటలను అదుపుచేశారు. సుమారు రూ:20 వేల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు రైతు తెలిపారు.
నేడు ఏపీ వైఎస్సార్‌టీపీ
జిల్లా కార్యాలయం ప్రారంభం
కడప ఎడ్యుకేషన్ : కడప నగరం జిల్లా పరిషత్ సమీపంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టా కార్యాలయం వద్ద ఏపీ వైఎస్సార్ టీచర్ అసోసియేషన్ జిల్లా కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభిస్తున్నట్లు వైఎస్సార్ టీఏ జిల్లా అధ్యక్షుడు సింగారెడ్డి అమర్‌నాథరెడ్డి, ప్రధాన కార్యదర్శి కిరణ్‌లు తెలిపారు. వైఎస్సార్ సీపీ కడప జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి తదితరులు కార్యక్రమానికి హాజరవుతారని వారు తెలిపారు.


