గాలివీడు : మండలపరిధి నూలివీడు గ్రామంలోని వడ్లపల్లిలో శనివారం పట్టపగలే చోరీ జరిగింది. గ్రామానికి చెందిన శిబ్యాల ప్రమీలమ్మ ఇంటిలో ఎవరూ లేని సమయంలో దొంగలు చొరబడి సుమారు 10 తులాల బంగారం, వెండి గొలుసులు, నగదును దోచుకెళ్లినట్లు బాధితురాలు తెలిపారు. ఉదయం కుటుంబ సభ్యులు గొర్రెలను మేపడానికి బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తలుపులు తెరిచి ఉండటం గమనించిన ప్రమీలమ్మ లోపలికి వెళ్లి చూడగా నగలు, నగదు కనిపించకలేదు. సమాచారం అందుకున్న గాలివీడు ఎస్‌ఐ నరసింహారెడ్డి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


