ప్రాణం తీసిన ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ఆన్‌లైన్‌ బెట్టింగ్‌

Mar 14 2026 7:43 AM | Updated on Mar 14 2026 7:43 AM

– గడ్డి మందు తాగి యువకుడి ఆత్మహత్య

ములకలచెరువు : ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లో డబ్బులు పోగొట్టుకొని ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ములకలచెరువు మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని దేవులచెరువు పంచాయతీ నీరుగట్టువారిపల్లెకు చెందిన జి.అనిల్‌కుమార్‌(25) ఇంటర్‌ పూర్తి చేసి గుంటూరులో ఉద్యోగం చేసుకునే వాడు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లకు అలవాటుపడి డబ్బులు అప్పు చేశాడు. బెట్టింగ్‌ కోసం చేసిన అప్పులు తీర్చలేక మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో బుధవారం గడ్డి నివారణ మందు తాగి ఇంట్లో వాంతులు చేసుకుంటుండగా గమనించిన కుటుంబ సభ్యులు మదనపల్లె ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం తిరుపతి రమాదేవి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. గురువారం రాత్రి అక్కడి నుంచి స్విమ్స్‌కు తరలిస్తుండగా మృత్యువాత పడ్డాడు. మృతుడి తల్లి జి.రామలక్ష్మమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రతాప్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement