మా పేరు అబ్దుల్ మజీద్, షహనాజ్ బేగం. మేము మదనపల్లె పట్టణం నాల్గవ వార్డులో నర్సింగ్ హోమ్ వీధిలో ఉంటున్నాం. మా ఇంటి జాగాను నా కుమార్తె మాకు తెలియకుండా మోసం చేసి రిజిష్టర్ చేయించుకుంది. వృద్ధాప్య దశలో ఉన్న మమ్మల్ని వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మా కుటుంబ సభ్యుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మా ఇంటిని మరమ్మతులు చేయించేందుకు రుణం ఇప్పిస్తామని సంతకాలు పెట్టించుకుని రిజిష్టర్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఇంటితోపాటు ఇంటి జాగాకు సంబంధించిన రిజిష్టర్ రద్దు చేయాలి. లేదా మాకు కారుణ్య మరణానికై నా అనుమతించండి.


