ఏప్రిల్‌ నుంచి 125 పని దినాలు | - | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ నుంచి 125 పని దినాలు

Mar 10 2026 7:29 AM | Updated on Mar 10 2026 7:29 AM

– కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

మదనపల్లె: ఏప్రిల్‌ నుంచి వికసిత్‌ భారత్‌ జి రామ్‌ జి పథకం ద్వారా పనులు చేసే కూలీలకు 125 రోజుల పనిదినాలు కల్పించనున్నట్లు కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ అన్నారు. సోమవారం పీజీఆర్‌ఎస్‌ హాలులో జరిగిన కార్యక్రమంలో ఉపాధి హామీ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త ఉపాధి పథకం అమలుతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. వీబీ జీరామ్‌జీ పథకం మరింత పారదర్శకంగా జరుగుతుందన్నారు. రైతులకు వ్యవసాయ పనుల సమయంలో కూలీల కొరత నివారించేందుకు 60 రోజులు ఉపాధి పనులకు విరామం ఉంటుందని అన్నారు. గ్రామాల్లో రోడ్లు, కాల్వలు పనులను, రైతులకు ఉపయోగపడే భూమి అభివృద్ధి పనులు, పండ్ల తోటల పెంపకం కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. సబ్‌ కలెక్టర్‌ కళ్యాణి, డీఆర్‌ఓ మధుసూదన్‌ రావు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ వెంకటరత్నం పాల్గొన్నారు.

పెండింగ్‌లోని

వెబ్‌ సమస్యలకు పరిష్కారం

మదనపల్లె డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ వెబ్‌ల్యాండ్‌ సమస్యలకు పరిష్కారం చూపుతున్నామని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ కోర్టు హాలులో జరిపిన కార్యక్రమంలో రైతులకు వన్‌బీలను అందించారు. మదనపల్లె మండలంలోని కోళ్లబయలు, కొత్తవారిపల్లి, వేంపల్లి, సీటీఎం తదితర గ్రామాలకు చెందిన తొమ్మిది మందికి వన్‌బీ పత్రాలను కలెక్టర్‌ రైతులకు అందజేశారు. మిగిలిన దరఖాస్తులపై త్వరితగతిన చర్యలు తీసుకుని పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement