అర్జీలు కోకొల్లలు.. పరిష్కారం నేలచూపులు ! | - | Sakshi
Sakshi News home page

అర్జీలు కోకొల్లలు.. పరిష్కారం నేలచూపులు !

Mar 10 2026 7:29 AM | Updated on Mar 10 2026 7:29 AM

పట్టాలు మంజూరు చేయాలి

ప్రజా ఫిర్యాదుల విభాగానికి

భారీగా భూ సమస్యల దరఖాస్తులు

వచ్చిన వారే పదేపదే వస్తున్నా

దొరకని పరిష్కారం

ముఖ్యంగా భూ సమస్య, పింఛన్ల కోసం

కలెక్టరేట్‌కు పరుగులు

సాక్షి అన్నమయ్య : జిల్లా ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. తమ గోడు వెల్లబోసుకునేందుకు కలెక్టరేట్‌కు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా భూ సమస్యలతో బాధితులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ప్రతి సోమవారం ప్రభుత్వం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వందల సంఖ్యలో అర్జీలు వస్తున్నా.. పరిష్కారం దొరకడం లేదు. కొందరు వితంతు పెన్షన్‌ రావడం లేదని, మరికొందరు తమ భూమి లాక్కున్నారని, ఇంకొందరు తమ భూమి చుట్టూ కంచె వేశారని అర్జీలు ఇస్తున్నారు. ఆదుకోవాలని ఒకరు.. అన్యాయమైపోయామని మరొకరు.. ఏదో ఒక సమస్యతో కలెక్టరేట్‌కు వస్తున్నారు. కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌తోపాటు ఇతర అధికారులు ఉన్నతస్థాయిలో సమీక్షిస్తున్నా కిందిస్థాయిలో సమస్యకు పరిష్కారం చూపలేకపోతున్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో ఇప్పటికీ పింఛన్‌ లాంటి చిన్నపాటి సమస్యలు కూడా అధికారులు మంజూరు చేయలేని పరిస్థితి నెలకొంది.

మా అనుభవంలో ఉన్న 2.50 ఎకరాల భూమికి పట్టాలు మంజూరు చేసి న్యాయం చేయాలి. తంబళ్లపల్లె మండలం దిగుపాలెం గ్రామంలో పట్టాల మంజూరు కోసం అనేకసార్లు రెవెన్యూ అధికారులను కలసినా వారు పట్టించుకోలేదు.. రోజులు గడుస్తున్నా న్యాయం జరక్కపోవడంతో మా గోడు వెళ్లబోసుకోవడానికి వచ్చినాం.

– ఎస్సీ, ఎస్టీ, యానాదులు,

చింతావారిపల్లె, సోంపాలెం పంచాయతీ, ములకలచెరువు మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement