ప్రజలకు భరోసా కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు భరోసా కల్పించాలి

Jan 28 2026 7:06 AM | Updated on Jan 28 2026 7:06 AM

ప్రజల

ప్రజలకు భరోసా కల్పించాలి

ఏఆర్‌ సిబ్బందికి మొబిలైజేషన్‌

శిక్షణలో ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి

రాయచోటి: పోలీసు వృత్తి ఉద్యోగం మాత్రమే కాదని, అది ప్రజల నమ్మకాన్ని కాపాడే బాధ్యత అని ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి పేర్కొన్నారు. మంగళవారం రాయచోటిలోని పోలీసు కార్యాలయంలో సాయుధ పోలీసు బలగాలు (ఏఆర్‌) కోసం ఏర్పాటు చేసిన రెండు వారా ల వార్షిక మొబిలైజేషన్‌ శిక్షణా కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, సాంకేతికతను, వృత్తి నైపుణ్యాన్ని జోడించినప్పుడే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని ఎస్పీ అభిప్రాయపడ్డారు. పోలీసులు అత్యంత క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. ఏటా నిర్వహించే శిక్షణ ద్వారా సిబ్బంది ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవడంతో పాటు, శిక్షణలో నేర్చుకున్న అంశాలను తిరిగి గుర్తుచేసుకుని సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు అవకాశం ఉంటుందన్నారు. జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి, ఏఆర్‌ డీఎస్పీ డి.ఏడుకొండల రెడ్డి, ఆర్‌ఐలు వీజే రామకృష్ణ, ఎం పెద్దయ్య, ఆర్‌ఎస్‌ఐలు, ఏఆర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజలకు భరోసా కల్పించాలి 1
1/1

ప్రజలకు భరోసా కల్పించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement