డిమాండ్లను పరిష్కరించాలి
మదనపల్లె రూరల్: బ్యాంకింగ్ రంగంలో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న వారంలో ఐదు రోజుల పని డిమాండ్‌ను తక్షణమే పరిష్కరించాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో మదనపల్లె ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ ఎదుట ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ... యూఎఫ్‌బీయూ దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా మంగళవారం మదనపల్లెలోని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నట్లు తెలిపారు.యూఎఫ్‌బీయూ సెక్రటరీ ఎస్‌బీఐ ఆఫీసర్ జి.సంతోష్, బి.సందీప్, ఎం.శశికళ, బీఓబీ వి.రవికిరణ్, ఏపీజీబీ ఆఫీసర్ షేక్‌షావలీ, ఇండియన్ బ్యాంక్ బి.రవికుమార్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎం.గోవర్ధన్, 200 మందికి పైగా బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు.


