ఆడబిడ్డకు అన్యాయం చేస్తున్న టీడీపీ నాయకుడు
మదనపల్లె రూరల్ : అనుచరుడికి అండగా నిలిచి, ముస్లిం ఆడబిడ్డనైన తనకు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు అన్యాయం చేస్తున్నాడని టీడీపీ పార్లమెంటరీ కార్యాలయంలో జోన్–4 ఇన్‌చార్జి దీపక్‌రెడ్డి, ఎమ్మెల్యే షాజహాన్‌బాషా సమక్షంలో బాధిత మహిళ జోయాఖాన్ నిలదీసింది. కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని, మూడునెలలుగా తనను ఇబ్బందికి గురిచేస్తున్నారని ఆరోపించింది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళితే, అధికారబలంతో పోలీసులకు ఫోన్‌చేసి అరెస్ట్ చేయనివ్వకుండా ఒత్తిడి తెస్తున్నాడని వాపోయింది. తనకు, తన బిడ్డకు ఏం జరిగినా బాధ్యత శ్రీ రామ్ చినబాబుదేనని పార్టీ పెద్దల ఎదుటే కన్నీటిపర్యంతమైంది. బాధిత మహిళ మాట్లాడుతూ...శ్రీరామ్ చినబాబు ప్రధాన అనుచరుడైన మహబూబ్‌ఖాన్ 12 ఏళ్ల క్రితం తనను ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడని, తమకు తొమ్మిదేళ్ల కుమార్తె ఉందన్నారు. కొంతకాలంగా మహబూబ్‌ఖాన్ వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యాబిడ్డలను నిర్లక్ష్యం చేశాడని చెప్పింది. ఇంటికి రావడం మానేశాడని చెప్పింది. దీనిపై మీడియా ఎదుట తన గోడు చెప్పుకుంటే...తన వెనుక టీడీపీ నాయకుడు చినబాబు ఉన్నాడని, నీవల్ల ఏమి అవుతుందో చేసుకోమని బెదిరించాడంది. దీనిపై మంత్రి నారాలోకేష్‌కు ఫిర్యాదుచేస్తే ఆయన స్టేషన్‌లో ఫిర్యాదుచేయాల్సిందిగా సూచించారంది. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ, పోలీసులు భర్తను అరెస్ట్ చేయకుండా ఫోన్‌చేసి శ్రీరామ్ చినబాబు అడ్డుకుంటున్నట్లు తెలిపింది. కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చి తనకు అన్యాయం చేస్తున్నాడని, పార్టీ పెద్దలు తనకు న్యాయం చేయాల్సిందిగా వేడుకుంది. తనకు, బిడ్డకు ఏమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత శ్రీరామ్ చినబాబుదేనంటూ పేర్కొంది.
పార్టీ పరిశీలకుడి ఎదుటే నిలదీసిన
ముస్లిం మహిళ


