కువైట్‌ను తాకిన రాజంపేట జిల్లా ఉద్యమ సెగ
రాజంపేట : రాజంపేట,రైల్వేకోడూరుకు చెందిన వేలాది మంది జీవనోపాధి కోసం కువైట్‌లో దేశంలో ఉన్న నేపథ్యంలో వారు కూడా జిల్లా కేంద్రంగా రాజంపేట ఉండాలనే డిమాండ్ లేవనెత్తారు. మాలియాలోని పవన్ రెస్టారెంట్‌లో ప్రవాసాంధ్రులు రాజంపేట మున్సిపల్ వైస్‌చైర్మన్, కాపు నేత మర్రి రవికుమార్ పదిరోజులుగా చేస్తున్న అన్నమయ్య జాయింట్ యాక్షన్ కమిటీ రిలే నిరాహారదీక్షలకు కువైట్ వైఎస్సార్‌సీపీ తరపున మద్దతు పలికారు. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఇప్పుడు రాజంపేటకు అర్హత ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ కువైట్ నేతలుు గోవిందు నాగరాజు, మర్రి కళ్యాణ్, నేతలు నాయని మహేష్‌రెడ్డి, మన్నూరు చంద్రరెడ్డి, లక్ష్మీప్రసాద్, రాంబాబు, నరసింహ, మహబూబ్‌బాషా, షేక్ సర్దార్, గజ్జల నరసింహారెడ్డి, యూవీ రమణారెడ్డి, నాగిరెడ్డి, చంద్రారెడ్డి, మురాతోటి మణి, అలీ తదితరులు పాల్గొన్నారు.
మాలియాలో రాజంపేట, రైల్వేకోడూరు వాసుల నిరసన


