అమరజీవి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
రాయచోటి : ఆంధ్ర రాష్ట్ర సాధనకోసం ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ముఖ్య అతిథిగా హాజరై శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు నిస్వార్థ సేవకు, అసమాన త్యాగానికి చిరునామాగా నిలిచారన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధనకు ఆయన చూపిన పట్టుదల, నిబద్ధత మన పోలీసు విధుల్లో కూడా ప్రతిబింబించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐలు జీవీ రామకృష్ణ, ఎం.పెద్దయ్య, సీఐలు జి.శంకర, మల్లయ్య, ఎ.ఆదినారాయణ రెడ్డి, పలువురు ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, డీపీఓ సిబ్బంది, పోలీసు సిబ్బంది, మహిళా పోలీసులు, హోంగార్డులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి


