నివేదనలే.. పరిష్కారం లేదు
● ఎంతో ఆశతో కలెక్టరేట్‌కు వస్తున్న బాధితులకు జరగని న్యాయం
● చిన్నపాటి సమస్యలకు దొరకని ఫలితం
● పదేపదే వచ్చిన వారే వస్తున్న వైనం
అర్జీదారుల నుంచి సమస్యలు వింటున్న కలెక్టర్ నిశాంత్ కుమార్
సమస్యలను కలెక్టర్ కార్యాలయంలో నమోదు చేయించుకుంటున్న అర్జీదారులు
రాయచోటి అర్బన్/ రాయచోటి టౌన్ : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందజేసిన అర్జీలు పరిష్కారం కావడం లేదు. జిల్లాలోని మూరుమూల ప్రాంతాల నుంచి కూడా ప్రతిసోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఎన్నెన్నో కష్టాలు, మరెన్నో అవస్థలు పడి ఇక్కడికి వస్తున్నారు. తల్లికి వందనం రాలేదని, సదరం సర్టిఫికెట్ ఇవ్వలేదని, భూసమస్యలు పరిష్కరించాలిని కోరుతూ అర్జీలు సమర్పించారు. ఇదే సమస్యలపై గతంలో పలుమార్లు అర్జీలు ఇచ్చినా ఫలితం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంధర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్ అర్జీలకు సకాలంలో, నాణ్యతతో పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.
● సంబేపల్లె మండలం కోట్రాళ్ల హరిజనవాడకు చెందిన వెంకటరమణ తన కుమార్తె స్వాతికి ఇంత వరకు తల్లికి వందనం నగదు అందలేదని అర్జీ ఇచ్చారు.
● రాయచోటికి చెందిన సుబ్బరామయ్య సదరం సర్టిఫికెట్ కేవలం 65శాతం మాత్రమే ఉందని ఇచ్చినట్లు కలెక్టర్ నిశాంత్‌కుమార్‌కు అర్జీ సమర్పించారు.
నివేదనలే.. పరిష్కారం లేదు


