క్రీడలతో మానసికోల్లాసం
రాయచోటి టౌన్ : క్రీడలు మానసిక ఉల్లాసానిస్తాయని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. శనివారం రాయచోటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాయచోటి డివిజన్ స్థాయిలోని ఆరు మండలాలకు చెందిన ఉపాధ్యాయులకు క్రీడాపోటీలు నిర్వహించారు.క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి అభినందనలు తెలిపారు. డివిజనల్ కో ఆర్డినేటర్ వీరాంజనేయులు ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి.క్రికెట్‌లో సంబేపల్లె జట్టు రాయచోటిపై గెలుపొందింది. మిగిలిన మ్యాచ్‌లు ఆదివారం ఉదయం నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.


