రైతుబజారులో రూ.20కు కిలో నిమ్మకాయలు
మదనపల్లె రూరల్ : పట్టణంలోని రైతుబజారులో రూ.20కు కిలో నిమ్మకాయలు విక్రయిస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం తెలిపారు. శనివారం రైతుబజారులో నిమ్మకాయల విక్రయకేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ విజయసునీత, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ ఆదేశాల మేరకు... ఆదివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కౌంటర్‌లో కిలో రూ.20 చొప్పున నిమ్మకాయలు విక్రయించనున్నట్లు చెప్పారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
శాస్త్రోక్తంగా స్నపన
తిరుమంజనం
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అర్చకులు మూల విరాట్‌లకు పంచామృతాభిషేకం జరిపారు. టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, పూలు, బంగారు ఆభరాణాలు, తులసి గజమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శనివారం కావడంతో స్వామి వారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలించ్చారు.
రాజంపేట : రాజంపేట కోర్టులో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో 2087 కేసులు పరిష్కరించి కక్షిదారులకు రూ. 58,67,880లు అందే విధంగా పరిష్కారపత్రాలు అందించినట్లు మూడో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ రాజంపేటలో 3 బెంచీలను ఏర్పాటు చేశామన్నారు. ఇన్ని కేసులు పరిష్కారం అయ్యేందుకు కృషి చేసిన పోలీసులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి టి కేశవ, జూనియర్ సివిల్ జడ్జి రాజన్ ఉదయ్ ప్రకాశ్, ఏపీపీ టి రామకృష్ణ, ఏజీపీ మౌనిక, బార్ ప్రెసిడెంట్ పి హనుమంత నాయుడు తదితరులు పాల్గొన్నారు.
రైతుబజారులో రూ.20కు కిలో నిమ్మకాయలు


