● ఫిర్యాదు చేసినా
మదనపల్లె: రాజ్యాంగంలో గ్రామపంచాయతీలకు ఉన్న ప్రాధాన్యత, గౌరవం ఏ పదవికి లేదు. సీఎం, పీఎంకై నా చెక్‌పవర్ ఉండదు. సీఎం, పీఎం ఏ పంచాయతీలో పర్యటించినా ఆ సర్పంచ్‌కు పక్కనే కుర్చీవేసి గౌరవిస్తారు. సర్పంచ్ పదవికి అంతటికి గౌరవం ఉంది. ప్రజల్లోనూ తమ పంచాయతీ సర్పంచ్‌ను మా ప్రెసిడేంటు అని చెప్పుకుంటారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక మదనపల్లె రూరల్ మండలంలో సర్పంచ్‌లకు ఇసుమంత గౌరవం కూడా లేకుండాపోతోంది. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన వీరిపై అధికారుల వేధింపులతో పంచాయతీల్లో పాలనను ప్రజలకు చేరువ కాకుండా అడ్డుకుంటుండగా ప్రస్తుతం పరిస్థితి తారస్థాయికి చేరింది. దీనికి ప్రధాన కారణం మండలంలోని 25 మంది సర్పంచ్‌ల్లో 23 మంది వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు కావడమే. ఇద్దరు టీడీపీ మద్దతుదారులుండగా వారికి ఎలాంటి షరతులు లేకుండా సహకరిస్తున్నారు.
పంచాయతీల్లో బలంలేదనే
మదనపల్లె మండలంలో 23 మంది వైఎస్సార్‌సీపీ మద్దతుదారులైన సర్పంచ్‌లు ఉండటం అధికారపార్టీనేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా ఉన్నప్పటికి మండలంలో ఆ పార్టీకి ఆదరణ లేకపోవడం, పంచాయతీ పర్యటనల్లో ప్రజలనుంచి స్పందన లేకపోవడంతో సర్పంచ్‌లను కట్టిడి చేసే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. నేరుగా టీడీపీ నేతలు రంగంలోకి దిగకుండా ఎంపీడీవో తాజ్ మస్రూర్ ద్వారా అడ్డంకులు సృష్టిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌లను తమమాట వింటారా లేదంటే ఇబ్బందులు పడతారా తేల్చుకోండి అన్న ధోరణితో ఎంపీడీవో పరోక్షంగా వ్యవహరిస్తున్నట్టు సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరించాలని పరోక్షంగా ఒత్తిడి తేస్తున్నారు. దీనికి ఒక్క సర్పంచ్ అంగీకరించడం లేదు.
కార్యదర్శులను నడిపిస్తున్న ఎంపీడీవో
అభివృద్ధి పనులు చేపట్టడం, వాటి బిల్లుల చెల్లింపు, పల్లెల్లో ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు నిధులు వెచ్చించాలంటే పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు కలిసి పని చేయాలి. అయితే కార్యదర్శులు సర్పంచ్‌లకు ఏమాత్రం సహకరించకుండా ఎంపీడీవో తాజ్ మస్రూర్ కట్టిడి చేస్తున్నారు. నేను చెప్పేదాక ఎవరి మాట వినొద్దు అని కార్యదర్శులకు ఎంపిడివో మౌఖిక ఆదేశాలు ఇచ్చారని చెబుతున్నారు. దీంతో పంచాయతీల్లో పనులు ఆగిపోయాయి.పంచాయతీలో ఒకపని జరగాలంటే అభివృద్ధి పని రికార్డులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలంటే మొదట కార్యదర్శి వాటిని అప్‌లోడ్ చేశాక ఓటీపీని ఎంటర్ చేయాలి, తర్వాత సర్పంచ్‌కు ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేశాక బిల్లు మంజూరుకు సిద్దం చేసినట్టు. అయితే ఇవేమి అవసరం లేదు సర్పంచ్‌లే వేలిముద్రతో బిల్లులు తీసుకొవచ్చు, వారే ఆప్‌లోడ్ చేసుకొవచ్చని ఎంపీడోవో తాజ్‌మస్రూర్ చెప్పారు. దీన్నిబట్టి చూస్తే ఎంపీడీవో వ్యవహారశైలి ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు.
సంబంధం లేకుంటే ఎందుకు సహకరించరు
ఈ విషయమై ఎంపిడివో తాజ్ మస్రూర్ వివరణ కోరగా కార్యదర్శులను కట్టడి చేసే అధికారం తనకు లేదని, అదంతా డీఎల్‌పిఓ చూసుకుంటారని చెప్పారు. ఇదే నిజమైతే ఎంపీడీవోకు పంచాయతీ కార్యదర్శులపై ఆజామాయిషీ లేదా, లేకుంటే పంచాయతీల్లో అభివృద్ధి పనులు ఎంపీడీవోకు తెలియకుండా జరిగే ఆస్కారం లేదు. పంచాయతీ కార్యదర్శులు విధుల్లో ఉన్నారా లేదా, సక్రమంగా హజరవుతున్నా లేదా, అభివృద్ది పనుల పరిశీలన, పనుల నాణ్యత తనిఖీ, పంచాయతీ రికార్డుల పరిశీలన, నిధుల వినియోగం ఇలా ఎన్నో అంశాలపై ఎంపిడివొకు అధికారం ఉంది. అయితే ఈ ఆధికారం తనకు లేదని చెప్పడం విడ్డూరంగా ఉంది.
ఎంపీడీవో తాజ్‌మస్రూర్ వైఖరిపై సర్పంచ్‌ల సంతకాలతో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ షమీంఅస్లాం, మున్సిపల్ చైర్మన్ వరపన మనూజ, సర్పంచ్‌లు కలిసి పీజీఆర్‌ఎస్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. సర్పంచ్‌ల సంఘ ప్రతినిధులు స్వయంగా కలిసి పంచాయతీల్లో పరిస్థితిని ఎంపిడివోకు విన్నవించారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సహకరించాలని కోరినా డోంట్ కేర్ అంటున్నారు. దీంతో ఈ అధికార పెత్తనం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
మదనపల్లె రూరల్ ఎంపీడివో రూటే సపరేటు
ఎమ్మెల్యే చెప్పింది చేస్తేనే సహకరిస్తారట
మాపై పెత్తనం ఏమిటని ప్రశ్నించినసర్పంచ్‌లపై పంచాయతీ కార్యదర్శులతో కక్ష సాధింపు
ఆ ఇద్దరు టీడీపీ సర్పంచ్‌లకుఏ షరతులు లేవు
● ఫిర్యాదు చేసినా


