వైభవం.. సీతారాముల పౌర్ణమి కల్యాణం
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో బుధవారం పౌర్ణమి సందర్భంగా ఉదయం 10 గంటలకు సీతాసమేతుడైన శ్రీ కోదండ రాముడి కల్యాణం వైభవంగా నిర్వహంచారు. ఈ సందర్భంగా అర్చకులు ఉత్సవ మూర్తులను కల్యాణవేదిక వద్ద కొలువుదీర్చారు. అనంతరం సుగంధద్రవ్యాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీళ్లతో అభిషేకాలు జరిపారు. నూతన పట్టువస్త్రాలు ధరింపజేసి, తులసి గజమాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం సీతారాముల పౌర్ణమి కల్యాణాన్ని అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణంలో చిన్నారుల భరతనాట్య ప్రదర్శన భక్తులను అలరించింది. స్వామి వారి కల్యాణాన్ని వీక్షించేందుకులు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.


