పదికి విజయపథం!
అమలు తీరు ఇలా...
మదనపల్లె సిటీ: కస్తూర్బాగాంధీ విద్యాలయాల (కేజీబీవీ) విద్యార్థులు పది, ఇంటర్మీడియట్ పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలనే ఆశయంతో సమగ్రశిక్ష అధికారులు ప్రణాళికలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం, సాయంత్రం ప్రత్యేక స్టడీ అవర్స్‌ను నిర్వహిస్తున్నారు. పది, ఇంటర్మీడియట్ పరీక్షలు విద్యార్థుల బంగరు భవష్యత్తుకు నిచ్చెనలాంటివి. వారి జీవితాలు మలుపు తిరిగేది ఇక్కడే. ప్రధానంగా కేజీబీవీ విద్యాలయాలపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. పూర్తిగా వెనుబడిన విద్యార్థినులపై ఫోకస్ పెట్టాలని ఎస్‌ఓలు,ఉపాధ్యాయులను ఆదేశించారు. ప్రణాళిక మేరకు సన్నద్ధమైతే ఉత్తీర్ణత మార్కులు సాధించడం పెద్ద సమస్య కాదు. ప్రత్యేక తరగుతులు నిర్వహించి వారిని పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. ఇందు కోసం స్టడీ అవర్స్ ,వారంతరపు పరీక్షల నిర్వహణ చేపట్టి ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేస్తున్నారు. దీంతో పాటు చదువులో వెనుబడినవారిని గుర్తించి వారిని ఉత్తీర్ణత సాధించేలా అధికారులు సీఆర్‌టీ, పీజీటీలతో పాటు ప్రిన్సిపాళ్లకు గూగుల్ మీట ద్వారా పలు సూచనలు ఇస్తున్నారు.
● జిల్లాలో 22 కేజీబీవీలు ఉన్నాయి. ఇందులో 802 మంది పదో తరగతి చదువుతుండగా, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం 634 మంది, ద్వితీయ సంవత్సరం 502 మంది చదువుతున్నారు. వందశాతం ఫలితాల సాధన కోసం ఈ విద్యా సంవత్సరం విజయపథం పేరుతో ప్రత్యేక తరగతులు, స్టడీ అవర్స్, రోజువారీ పరీక్షలు, వెనుకబడిన విద్యార్దుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
నిత్యం పర్యవేక్షణ: కేజీబీవీల విద్యార్థినుల పట్ల జీసీడీఓ ప్రతి రోజు పర్యవేక్షణ చేస్తున్నారు. విద్యార్థుల చదువుతో పాటు మెనూ ప్రకారం భోజనం వంటివి అమలు తీరుపై గూగుల్ మీట్ ద్వారా తెలుసుకుంటున్నారు. దీంతో పాటు ఉపాధ్యాయులు ప్రతి రోజు లోకేషన్ ఫోటోలు పంపాల్సి ఉంది. పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నారు.
జిల్లాలో కేజీబీవీలు: 22
పదో తరగతి విద్యార్థులు: 802
ఇంటర్ మొదటి సంవత్సరం
విద్యార్థులు: 632
ద్వితీయ సంవత్సరం విద్యార్థులు: 502
కేజీబీవీలలో ప్రతి రోజు ఉదయం 6.30 నుంచి 7.30 వరకు స్టడీ అవర్స్ గంట పాటు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఉల్లాసంగా ఉండటానికి ప్రతి రోజు యోగా చేయిస్తున్నారు. ప్రత్యేకంగా ఉదయం రాగిమాల్ట్ అందిస్తున్నారు. తర్వాత తరగతులు నిర్వహిస్తున్నారు. తరువాత స్టడీ అవర్స నిర్వహించి వారికి సందేహాలు వస్తే నివృత్తి చేస్తున్నారు.
పకడ్బందీగా విజయపథం అమలు:
కేజీబీవీల్లో ఉత్తమ ఫలితాల సాధనకు విజయపథం పకడ్బందీగా అమలు చేస్తున్నాం. పదో తరగతితో పాటు ఇంటర్మీయట్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాం. వందశాతం ఫలితాలు లక్ష్యంగా పని చేస్తున్నాం. –బి.సుమతి, జీసీడీవో, సమగ్రశిక్ష
వందశాతం ఉత్తీర్ణతకు కృషి
కేజీబీవీల్లో వంద శాతం ఉత్తీర్ణతకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు ప్రతి రోజు జీసీడీవో పర్యవేక్షిస్తున్నారు. ప్రణాళిక ప్రకారం మంచి ఫలితాల సాధనపై దృష్టి పెడుతున్నారు.
–సుబ్రమణ్యం, జిల్లా విద్యాశాఖ అదికారి
పదికి విజయపథం!
పదికి విజయపథం!


