 
															ఇద్దరు గంజాయి నిందితుల అరెస్టు
రెండు కిలోల గంజాయి, 2 సెల్‌ఫోన్లు స్వాధీనం 
మదనపల్లె రూరల్ : కురబలకోటలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. స్థానిక రూరల్ సర్కిల్ పోలీసు కార్యాలయంలో విలేకరులకు సీఐ సత్యనారాయణతో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. కొన్నిరోజులుగా గంజాయి విక్రయాలపై నిఘా ఉంచామన్నారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం అందిన సమాచారంతో ముదివేడు ఎస్‌ఐ దిలీప్ కుమార్ సిబ్బందితో కలిసి కురబలకోట రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్దకు వెళ్లారన్నారు. చంద్రాకాలనీకి చెందిన ఆటో డ్రైవర్ మూడే మణికంఠనాయక్(19), మదనపల్లె మండలం కురవపల్లికు చెందిన మల్లకుంట గోవిందు(67) వారిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించడంతో అదుపులోకి తీసుకుని విచారించారని పేర్కొన్నారు. వారి వద్ద తనిఖీ చేసి రెండు కిలోల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కొంతమందితో కలిసి ముఠాగా ఏర్పడి మదనపల్లె పట్టణానికి చెందిన జాఫర్‌అలీ, గంగిశెట్టి శివకుమార్, బన్ను, తేజ, విష్ణు దగ్గర నుంచి గంజాయి కొనుగోలు చేసి, 10, 20 గ్రాముల ప్యాకెట్లుగా తయారుచేసి యువత, విద్యార్థులకు విక్రయించే వారమని నిందితులు తెలిపారన్నారు. నిందితులపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచామన్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారు పరారీలో ఉన్నారని, వారికోసం గాలిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల ప్రవర్తన, చదువులపై తల్లిదండ్రులు వాకబు చేయాలని, నిర్లక్ష్యం చేస్తే వారి భవిష్యత్తు అంధకారం అవుతుందని హెచ్చరించారు. కేసు దర్యాప్తులో ప్రతిభచూిపిన ముదివేడు ఎస్‌ఐ దిలీప్‌కుమార్, సిబ్బంది సుధాకర్, రెడ్డి శేఖర్, వెంకటేశ్వర్లు, సిద్ధేశ్వర్, శ్రీనివాసులు, ప్రసాద్, చక్రపాణిలకు పోలీసు రివార్డు కోసం సిఫారసు చేసినట్లు తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
