 
															దొర్రిచెరువు నిండితే ఇబ్బంది ఉండదు
మా గ్రామంతోపాటు మరో రెండు గ్రామాలు దొర్రిచెరువు నీటిపైనే ఆధారపడి ఉన్నాయి. ఆక్రమణలతో దొర్రిచెరువు నానాటికీ కుచించుకుపోతోంది. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారుల్లో స్పందన ఉండటం లేదు. అలాగే హైవే విస్తరణలో భాగంగా ఇక్కడ ఉన్న చెరువు భూమి తమదని పట్టాలు సృష్టించుకుని, నష్టపరిహారం పొందుతుండటం విస్తుపోయేలా చేస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించాలి. దొరిచెరువు ఆక్రమణకు గురికాకుండా చూడాలి. అలాగే దొర్రిచెరువుకు వచ్చే కాలువల క్రింద తవ్వకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– కాలాడి జనార్దన్ రెడ్డి, సర్పంచ్, అప్పకొండయ్యగారిపల్లి, లక్కిరెడ్డిపల్లి మండలం
మూడేళ్లుగా వర్షాలు లేక పంటలు సాగుచేసుకోలేక పోతున్నాం. వెలిగల్లు నీటి ద్వారా దొర్రిచెరువును నింపితే ఈ ప్రాంత ప్రజలకు తాగు, సాగునీటికి ఇబ్బంది ఉండదు. ఇప్పటికే చెరువు సగం ఆక్రమణకు గురైంది. వెలిగల్లు కాలువలను తవ్వేసి నీరు లేకుండా చేస్తున్నారు. అధికారులు, రెవెన్యూ సిబ్బంది చొరవచూపి ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి. లక్కిరెడ్డిపల్లి టౌన్‌తోపాటు మా ప్రాంతంలోని చాలా పల్లెలకు దొర్రిచెరువే ఆయువుపట్టుగా ఉంటుంది. – బాబు, చింతకుంట వాండ్లపల్లి,
లక్కిరెడ్డిపల్లి మండలం
 
							దొర్రిచెరువు నిండితే ఇబ్బంది ఉండదు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
