పరవళ్లు తొక్కుతున్న పింఛా
పింఛా ప్రాజెక్టు రెండు గేట్ల నుంచి నీటి విడుదల
సుండుపల్లె: మండల పరిధిలోని పింఛా ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు వంకలు, వాగుల ద్వారా ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు రావడంతో అధికారులు మంగళవారం రెండు గేట్ల ద్వారా నీటిని విడుదల చేశశారు. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతంలోని పింఛా నది, ఎనుపోతుల వంక, తలకోన ఏటితో పాటు సమీపంలోని వంకల ద్వారా వర్షపు నీరు భారీగా చేరింది. ప్రాజెక్టులో నీటిసామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేస్తూ మిగతా నీటిని రెండు గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి విడుదల చేశశారు. మంగళవారం సాయంత్రానికి ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులోనికి 1819 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తుండటంతో 1640 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేసిన సందర్భంగా నదీ పరివాహక ప్రాంతాలలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


