ప్రమాణస్వీకారం
సిద్దవటం: సిద్దవటంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో గురువారం శ్రీ నిత్యపూజస్వామి పాలకమండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ చైర్మన్‌గా జంగిటి రాజేంద్రప్రసాద్, పాలకమండలి సభ్యులుగా పి.మల్లేశ్వరి, పి.వసంత, బి.వెంకటసుబ్బయ్య, వి.కృష్ణయ్య, ఆర్.పార్వతమ్మ, కె.మల్లీశ్వరి, సి.వెంకటసుబ్బయ్య, జె.శివారెడ్డి, కె.రూప, ఎక్స్ ఆఫీషియో సభ్యులు, అర్చకులు రంగసముద్రం సుబ్రమణ్యంశర్మల చేత ఈఓ శ్రీధర్ ప్రమాణస్వీకారం చేయించారు. రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి చమర్తి జగన్‌మోహన్‌రాజు పాల్గొన్నారు.
రాజంపేట: వైఎస్సార్‌సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యునిగా చొప్పా ఎల్లారెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు గురువారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మే రకు నియామకపు ఉత్తర్వులు జారీ అయ్యాయి. చొప్పా ఎల్లారెడ్డి గతంలో రాజంపేట మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు.
కడప ఎడ్యుకేషన్: డాక్టర్ వై.ఎస్.ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ప్రవేశాలకు నవంబర్ 5వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వైస్ చాన్సులర్ జయరామిరెడ్డి తెలిపారు. ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ, ఎంఈసీతోపాటు డిప్ల మాలో ఓ బ్రాంచ్ పాసైన వారైనా అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. విద్యార్థుల కలలను సాకారం చేసే సృజనాత్మక విశ్వవిద్యాలయం ఏఎఫ్‌యూ అని తెలిపారు. వివరాలకు 99855 88105, 90524 60323 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.
మదనపల్లె సిటీ: నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్‌ఎంఎంఎస్)కు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 25వతేదీ వరకు గడువు పొడిగించారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 7–12–2025న నిర్వహించే ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు జిల్లాలో అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈనెల 27వతేదీ, ప్రింటెడ్ నామినల్ రోల్, ఒరిజనల్ ఎన్‌బీఐ కలెక్ట్ రశీదును డిఈవో కార్యాలయంలో అందజేసేందుకు ఈనెల 29 చివరి తేదీగా పేర్కొన్నారు. డీఈవో లాగిన్‌లో దరఖాస్తు ధ్రువీకరించేందుకు ఈనెల 31వరకు గడువు ఉందన్నారు.
రాయచోటి జగదాంబసెంటర్: పాఠశాల కమిషనర్ ఆదేశాల మేరకు నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి కె.సుబ్రమణ్యం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 8–10వ తరగతులు చదువుతున్న వారికి పోటీలు నిర్వహించాలన్నారు.
● పాఠశాల స్థాయిలో ఈ నెల 24వ తేదీన, మండల స్థాయిలో ఈ నెల 27న, నియోజకవర్గ స్థాయిలో ఈ నెల 28వ తేదీన పోటీలు ఉంటాయన్నారు. ఉంటుందన్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కొక్కరిని ఎన్నుకోవాలి. (ప్రతి డివిజన్‌కు తప్పనిసరిగా ఒక బాలిక ఉండే విధంగా) రాష్ట్ర స్థాయికి పంపాలి. వీరు రాష్ట్ర స్థాయిలో ఒక రోజు శిక్షణ పొందుతారని డీఈఓ తెలిపారు.
మదనపల్లె: తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు చెరువులు నిండి ప్రవహిస్తున్నాయని, వాటికి ఎలాంటి ప్రమాదం లేదని జలవనరులశాఖ మదనపల్లె ఈఈ సురేష్‌బాబు అన్నారు. గురువారం ఆయన మదనపల్లె రూరల్ మండలంలోని కదిరమ్మ చెరువు, మేడిపల్లి చెరువు, వెంకటమ్మ చెరువు, కనికల చెరువులను పరిశీలించారు. కదిరమ్మ చెరువుకు గండి పడిందన్న సమాచారంతో చర్యలు తీసుకున్నామని, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. అలాగే మిగిలిన చెరువులు పటిష్టంగా ఉన్నాయని, చెప్పారు.
బి.కొత్తకోట: మండలంలోని గుమ్మసముద్రం పంచాయతీలోని గుమ్మసముద్రం, బయ్యప్పగారిపల్లె పంచాయతీలోని మొగసాలమర్రి చెరువులను జలవనరులశాఖ ఈఈ సురేష్‌బాబు గురువారం పరిశీలించారు. మొగసాలమర్రి చెరువు మొరవ నీళ్లు ప్రవాహానికి అడ్డంకులు ఉండటంతో వాటిని తొలగించే చర్యలు చేపట్టామని సురేష్‌బాబు తెలిపారు. ఆయనవెంట ఏఈ సతీష్ ఉన్నారు.


