ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
● ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి
రాజంపేట: ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజంపేట ఎంపీ, లోక్‌సభ ఫ్లోర్‌లీడర్ పీవీ మిథున్‌రెడ్డి గురువారం కోరారు. వర్షాల కారణంగా విద్యుత్ ప్రమాదాలు, ఆరోగ్యసమస్యలు సంభవించే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా రైతులు వ్యవసాయపొలాల్లో జాగ్రత్తగా ఉండాలన్నారు. గుంతలు, చెరువులు,ఏర్ల వద్దకు యువత వెళ్లరాదన్నారు.
ఒంటిమిట్ట: గత రెండు రోజులుగా ఒంటిమిట్ట, సిద్దవటం మండలాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. మరో 48 గంటలు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలకు విద్యుత్ సరఫరా అందించడంలో అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కడప జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈ రమణ సిబ్బందికి సూచించారు. గురువారం మండల పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఆయన మాట్లాడుతూ..ప్రజల భద్రత, సేవల పునరుద్ధరణ కోసం ఏపీఎస్పీడీసీఎల్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్లను పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేయాలన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వాట్సప్,హెల్ప్‌లైన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏఈ ఉదయ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి


