ఎంపీహెఈవో నూతన కార్యవర్గం | - | Sakshi
Sakshi News home page

ఎంపీహెఈవో నూతన కార్యవర్గం

Oct 18 2025 7:19 AM | Updated on Oct 18 2025 7:19 AM

ఎంపీహ

ఎంపీహెఈవో నూతన కార్యవర్గం

రాయచోటి టౌన్‌ : అన్నమయ్య జిల్లా ఎంపీహెచ్‌ఈవో(మల్టీ పర్పపస్‌ హెల్త్‌ ఎక్స్‌టెక్షన్‌ ఆఫీసర్స్‌ అసోషియేషన్‌) నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

రాయచోటి ఎన్జీవో హోంలో నిర్వహించిన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.శివయ్య, ఎన్నికల అధికారి ఎం.నరసింహులు, టి.విద్యాసాగర్‌ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా జి.జయరామయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శగా వి.రమణ నాయక్‌, జిల్లా కోశాధికారిగా ఎస్‌.ముజీబ్‌బాషా, ఉపాధ్యక్షులుగా కె.లక్ష్మినారాయణ, బి.రామచంద్ర, జిల్లా జాయింట్‌ సెక్రటరీగా బీవీ.రమణయ్య, జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా శివారెడ్డిలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జయరామయ్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1100 మంది గెజిటేడ్‌, నాన్‌ గెజిటేడ్‌ హోదాలో ఉన్న వారు సంఘంలో ఉన్నారని చెప్పారు. అసోసియేషన్‌ క్యాడర్‌కు గెజిట్‌ కల్పించాలని, సీహెచ్‌సీ బేసిక్‌తో సమానంగా ఎంపీహెచ్‌ఈవో బేసిక్‌ ఉండాలని డిమాండ్‌ చేశారు. ఎంపీహెచ్‌ఈవో క్యాడర్‌ను మండల హెల్త్‌ ఆపీసర్‌గా మార్చాలని, అబాలిష్‌ అయిన ఎంపీహెచ్‌ఈవో పోస్టులను సర్దుబాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఎన్నికల వ్యవహరించారు.

జి.జయరామయ్య

వి.రమణనాయక్‌

ఎస్‌.ముజీబ్‌బాషా

ఎంపీహెఈవో నూతన కార్యవర్గం1
1/2

ఎంపీహెఈవో నూతన కార్యవర్గం

ఎంపీహెఈవో నూతన కార్యవర్గం2
2/2

ఎంపీహెఈవో నూతన కార్యవర్గం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement