
ఎంత కష్టం.. ఎంత నష్టం
గుర్రంకొండ: ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలోని టమాటా తోటలు భారీగా దెబ్బతిన్నాయి. వర్షాల కారణంగా నల్లమచ్చలు, గజ్జిరోగాలతో పంట దిగుబడి తగ్గిపోయింది. ధరలు ఇప్పుడిప్పుడే పుంజుకొంటున్నా రోగాలతో తోటలు దెబ్బతిని రైతులు భారీగా నష్టపోయారు. వందక్రీట్ల టమటా కోతల్లో సుమారు 35 నుంచి50 క్రీట్ల వరకు రోగాలబారిన పడినకాయలే ఉంటున్నాయి. మార్కెట్లో ప్రస్తుతం 25కేజీల టమాటా క్రీట్ ధర రూ. 550 పలుకుతుండగా రోగాల బారిన పడిన టమాటాలను మార్కెట్లో కొనే వారు లేక పలువురు రైతులు కాయలు కోయకుండా తోటలు వదిలేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 7560 ఎకరాల్లో టమాటా పంట దెబ్బతింది.
ధరలు పుంజుకొంటున్నా దిగుబడి ఏది?
ప్రస్తుతం మార్కెట్లో టమాటా ధరలు పుంజుకొంటున్నాయి. వారం రోజుల కిందటవరకు 25కేజీల క్రీట్ ధర రూ. 300 లోపు ఉండగా ప్రస్తుతం రూ.550 వరకు ధరలు పలుకుతున్నాయి. అయితే ధరలు పుంజుకొంటున్నా పంట దిగుబడి మాత్రం రోగాలు, వైరస్‌ల కారణంగా సగానికిపైగా తగ్గిపోయింది. దీంతో రైతులు ఆందొళన చెందుతున్నారు. టమాటాపై ఒకమచ్చ మాత్రమే ఉన్న కాయలు 25కేజీల క్రీట్ ధర కేవలం రూ. 50 నుంచి రూ.80 లోఫు మాత్రమే ధరలు పలుకుతున్నాయి. మచ్చల సంఖ్య ఎక్కువగా ఉంటే వ్యాపారులు కొనడానికి నిరాకరిస్తున్నారు. దీంతో చేసేదిలేక రైతులు రొడ్డుపక్కన పారోబోసి వెళ్లిపోతున్నారు.ప్రస్తుతం నల్లమచ్చలు, గజ్జిరోగాలున్న టమాటా తోటల్లో కాయలు ఎకరానికి 240 నుంచి 280 క్రీట్లు వస్తున్నాయి.
35 నుంచి50 శాతం మేరకు
మచ్చలున్న టమాటాలే:
వర్షాల కారణంగా మంచి కాపుమీదున్న టమాటా తోటల్లో 35 నుంచి 50 శాతం మేరకు కాయలు దెబ్బతిన్నాయి. కోత సమయంలో వంద క్రీట్లకు 35 నుంచి 50 క్రీట్లు నల్లమచ్చలున్న టమాటాలే ఉండడం గమనార్హాం. వీటిని మామూలు టమాటాల నుంచి వేరు చేసి మార్కెట్‌కు తర లించాలంటే తలప్రాణం తోకకు వస్తోందని రైతులు వాపోతున్నారు. కొన్ని మండలాల్లో 50 శాతం నుంచి 75 శాతం మేరకు నల్లమచ్చలు రావడంతో పంటను కాపాడుకోవడం భారంగా మారింది.
7560 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు:
వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా 7560 ఎకరాల్లో టమాటా పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కాయల రూపురేఖలు మారిపోయాయి. ఓ వైపు నల్లమచ్చలు, మరోవైపు రంధ్రాలున్న కాయలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ రకం కాయలకు మార్కెట్లో డిమాండ్ లేకపోవడంతో చేసేదిలేక పలువురు రైతులు తోటలవద్దనే పారబోస్తున్నారు. మరికొంతమంది పశుగ్రాసంగా వినియోగిస్తున్నారు. లక్షలాది రూపాయలు ఖర్చుచేసినా ఫలితం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాగు చేసిన పంట
ఎకరాల్లో: 18532
దెబ్బతిన్నపంట ఎకరాల్ల్లో: 7560
అమ్ముడుబోని టమాటాలను రోడ్డుపక్కన పారబోసిన రైతులు పొలాల వద్ద పశుగ్రాసంగా మారిన టమాటాలు
వర్షాలకు దెబ్బతిన్న టమాటా
నల్లమచ్చలు,గజ్జి రోగాలతోతగ్గిన పంట దిగుబడి
పలుచోట్ల కాయలు కోయకుండాతోటల్లో వదిలేసిన రైతులు

ఎంత కష్టం.. ఎంత నష్టం

ఎంత కష్టం.. ఎంత నష్టం

ఎంత కష్టం.. ఎంత నష్టం