
నష్టపోయాం
వర్షాలతో టమాటా పంటకు నల్లమచ్చలు, గజ్జిరోగాలు సోకి తోటలు దెబ్బతిన్నాయి. వైరస్‌లు, రోగాల కారణగా ఎకరం పంటకు సుమారు 800 క్రీట్ల దిగుబడి రాగా ఇందులో సగానికిపైగా అంటే 300నుంచి 400క్రీట్ల వరకు నల్లమచ్చలున్న టమాటాలు వస్తున్నాయి. చెట్టుకాండం నుంచి ఆకులు, కాయలతో సహా నల్లమచ్చలు ఏర్పడ్డాయి. దీంతో తీవ్రంగా నష్టపోయాం. – రెడ్డిమోహన్, గుర్రంకొండ
కొనేవారు లేరు
మార్కెట్లో నల్లమచ్చలు, గజ్జి రోగం సోకిన టమాటాలను కొనేవారు కరువయ్యారు. నాణ్యమైన టమాటాలు ఒక క్రీట్ ధర రూ.550వరకు పలుకుతున్నాయి. అయితే నల్లమచ్చలున్న కాయలు ఒక క్రీట్ ధర రూ.70లోపే ఉంటోంది. దీంతో ఒకక్రీట్‌కు రూ.500 వరకు రైతులు నష్టపోతున్నారు. టమాటా తోటల్లొ రోగాల నివారణ కోసం ఎకరానికి రూ. 60 వేలు వరకు మందుల కొసం ఖర్చు చేయాల్సి వస్తోంది. –మల్లయ్య, మొరంపల్లె

నష్టపోయాం