
అప్రజాస్వామికం
పత్రికలు ప్రజాస్వామ్యానికి మూలస్తంభం లాంటివి. ప్రభుత్వ వైఫ ల్యాలను ఎత్తిచూపుతున్నారనే కక్షతో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదు. సాక్షి ఎడిటర్ ధునుంజయరెడ్డి, పాత్రికేయులపై అక్రమకేసులు పెట్టడం అప్రజాస్వామికం. తక్షణమే వీటిని రద్దుచేయాలి.
–రామిరెడ్డి ధ్వజారెడ్డి, వైస్‌ఎంపీపీ, రైల్వేకోడూరు
బెదిరింపులు మానుకోవాలి
కూటమి ప్రభుత్వం మీడియా పట్ల బెదిరింపు ధోరణి మానుకోవాలి. ప్రభుత్వ అక్రమాలను ప్రజలకు మీడియా ద్వారా చేరవేస్తున్నందుకు కక్షకట్టి సాక్షి ఎడిటర్,పై కేసు లు పెట్టడం సరికాదు. భవిష్యత్తు లో మూల్యం చెల్లించుకుంటారు. – శ్రీనివాసులు, సీనియర్
రిపోర్టర్, ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ మాజీ డైరెక్టర్
కూటమిది కక్షసాధింపు
ప్రభుత్వ విధానాల్లోని లోపాలను ఎత్తిచూపుతున్న పత్రికలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్య లకు దిగడం సిగ్గుచేటు.ఇది వాస్తవాలను సమాధి చేయాలనే దుష్ట పన్నాగం. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై అక్రమంగా బనాయించిన కేసులను రద్దు చేయాలి.
–చిన్ననాగిరెడ్డి, ఉప సర్పంచ్, చాకిబండ
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు సరికాదు
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమంటే ప్రజాస్వామ్య స్ఫూర్తికే ప్ర మా దం. ఇటువంటి చర్యల ను ప్రజలు హర్షించరు. స్రాక్షి కార్యాలయంపై దాడులు, ఎడిటర్‌పై కేసులు నమోదు చేయడం.. పత్రికా స్వేచ్ఛను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వెంటనే మార్చుకోవాలి.
– యర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి, మండల
సర్వీసెస్ కమిటీ మాజీ సభ్యులు, సుండుపల్లె

అప్రజాస్వామికం

అప్రజాస్వామికం