
పరిశ్రమల ఏర్పాటుకు త్వరగా అనుమతులు ఇవ్వాలి
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
రాయచోటి: సింగిల్ డెస్క్ విధానంలో క్రింద జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుంచి అందిన దరఖాస్తులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని జిల్లా కలెక్ట్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్షరెన్స్ హాల్‌లో జిల్లా పరిశ్రమల, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. సింగిల్ డెస్క్ విధానం కింద గడిచిన త్రైమాసికంలో అందిన దరఖాస్తుల పరిష్కారం చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి వివిధ రాయితీల మంజూరు అంశాలపై కలెక్టర్ సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కె. కృష్ణ కిషోర్, డిఆర్‌డీఏ పీడీ నాగేశ్వరరావు, రాయచోటి మున్సిపల్ కమీషనర్ రవి, జడ్పీఎం ఏపీఐఐసీ రమణమూర్తి, జిల్లా రవాణా శాఖ అధికారి, విద్యుత్ శాఖ అధికారి, డయా ఇండస్ట్రియల్ అసోసియేషన్ ప్రతినిధి రాజశేఖర్, టెక్కి అసోసియేషన్ ప్రతినిధి రామమూర్తి నాయక్ పాల్గొన్నారు.
● సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమపై అన్నమయ్య షాపింగ్ పెస్టివల్‌ను కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రారంభించారు. శుక్రవారం రాయచోటిలోని జూనియర్ కలాశాల గ్రౌండ్‌లో జేసీ ఆదర్శ రాజేంద్రన్, ఆర్డీఓ శ్రీనివాస్‌తో కలిసి షాపింగ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంపై ఏర్పాటు చేసిన స్టాళ్లు, ఫుడ్ కోర్టులను సందర్శించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ సత్యనారాయణ, రాయచోటి తహసీల్దార్ నరసింహ కుమార్, వాణిజ్య పన్నుల శాఖ అధికారిణి సుమతి, టూరిజం శాఖ అధికారి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.