
ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
పత్రికా స్వేచ్ఛను కాలరాయాలని చూడటం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటిది. పత్రికలో వచ్చిన కథనాల్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే న్యాయబద్ధంగా ఎదుర్కోవాలే తప్ప ఇలా వ్యవహరించడం సరికాదు. ప్రభుత్వ చర్యల్ని ఖండిస్తున్నాం. సాక్షి మీడియా ప్రతినిధులపై వేధింపులు ఆపాలి. –జీవీ ప్రసాద్,
విద్యావేత్త, మదనపల్లె
మూల్యం చెల్లించుకుంటారు
పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. సాక్షి కార్యాలయంపై దాడులు, ఎడిటర్‌పే కేసులు అప్రజాస్వామికం. వీటికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.తక్షణమే సాక్షి మీడియా ప్రతినిధులపై వేధింపులు ఆపాలి.
– ముద్దా బాబుల్ రెడ్డి, మండలాధ్యక్షుడు
పత్రికా స్వేచ్ఛను హరించడమే
సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై కక్ష గట్టి పోలీసుల సాయంతో వరుసగా కేసులు నమోదు చేయడం ఆక్షేపణీయం.పభుత్వ వైఫల్యాలపై సాక్షిలో కథనాలు ప్రచురించారని పత్రికా కార్యాలయాలపై దాడులు చేయడమేమిటి?..ఇది అనాగరికం. ప్రభుత్వం ఇప్పటికై న తన తప్పును తెలుసుకుని వ్యవహరించాలి.
– మూరి శంకర్ రెడ్డి,
పంచాయతీ రాజ్ వింగ్ అధ్యక్షుడు
అప్రజాస్వామికం
భారత రాజ్యాంగ వ్యవస్థకు తూట్లు పొడుస్తూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది. పత్రిక స్వేచ్ఛను అణిచివేసేందుకు సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై కేసులు పెట్టి ఒత్తిడికి గురి చేస్తోంది. ఇది అప్రజాస్వామికం. ప్రజాస్వామ్యవాదులంతా ఈ చర్యలను ఖండిస్తున్నారు.
–వత్తలూరు సాయికిషోర్ రెడ్డి,వైఎస్సార్ సీపీ
మండల కన్వీనర్, ఓబులవారిపల్లి

ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు

ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు

ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు