
కారు ఢీకొని ఇద్దరికి గాయాలు
కలకడ : ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలైన సంఘటన గురువారం మండలంలోని కోన గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నంద్యాల జిల్లా అహోబిలానికి చెందిన మల్లికార్జున, నెల్లూరు జిల్లా రాపూరుకు చెందిన బుజ్జయ్య కోన గ్రామం వద్ద బొగ్గులు కాల్చుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారు ద్విచక్ర వాహనంలో కోన గ్రామం బస్టాండు వద్దకు వెళ్తుండగా కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరికి కాలు విరగగా, మరొకరికి తలకు రక్త గాయమైంది. క్షతగాత్రులను 108 వాహనంలో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కలకడ పోలీసులు కేసు నమోదు చేశారు.

కారు ఢీకొని ఇద్దరికి గాయాలు