
అరుదైన శస్త్ర చికిత్స
రాయచోటి టౌన్‌న్: రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో థైరాయిడ్‌కు అరుదైన శస్త్ర చికిత్స చేసి పెద్ద సైజు గడ్డను తొలగించారు. రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో గురువారం ఆర్‌ఎంఓ డాక్టర్ డేవిడ్ సుకుమార్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాయచోటి పట్టణానికి చెందిన శారదమ్మ (65) థైరాయిడ్ జబ్బుతో సుమారు నాలుగేళ్లుగా బాధపడుతోంది. నెల రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చింది. డాక్టర్ శైలేష్, డాక్టర్ లక్ష్మీప్రసాద్ చర్చించి ఆమెకు వైద్య పరీక్షలు చేయించారు. గొంతులో సుమారు 10 సెంటీమీటర్ల వ్యాసార్థంతో గడ్డ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఈఎన్‌టీ డాక్టర్ నరసింహ సహకారంతో అనస్థియా డాక్టర్లు డాక్టర్ వెంకట శివ, డాక్టర్ అనిల్, డాక్టర్ బండారు కిరణ్ కుమార్‌లు సుమారు రెండున్న గంటల పాటు శ్రమించి శస్త్ర చికిత్స చేసి గొంతులో ఉన్న గడ్డను తొలగించారు.