
మోసంపై డీఎస్పీకి ఫిర్యాదు
మదనపల్లె:స్థానిక చీకలగుట్టకు చెందిన దంపతులు తనవద్ద డబ్బు, ఆభరణాలను తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేసిన ఉదంతంపై గురువారం హిజ్రా స్వాతి డీఎస్పీ మహేంద్రను కలిసి ఫిర్యాదు చేసింది. ఆ దంపతులనుంచి ఎదురైన పరిస్థితులను బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించిన స్వాతి వాటికి సంబంధించిన వివరాలు, డబ్బు తీసుకున్న వాటికి ఆధారాలు, ఆభరణాల వివరాలను వివరించగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇచ్చారని స్వాతి తెలిపింది. దీనిపై మదనపల్లె రెండో పట్టణ సీఐ రాజారెడ్డిని విచారణకు డీఎస్పీ ఆదేశించారని తెలిపింది.
ఎంపీడీఓ కార్యాలయం
ఆకస్మిక తనిఖీ
లక్కిరెడ్డిపల్లి : జెడ్పీ సీఈఓ ఓబులమ్మ గురువారం లక్కిరెడ్డిపల్లి ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో సిబ్బంది పనితీరుపై ఆరా తీయడంతోపాటు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ్యంపై దృష్టి సారించేలా గ్రామస్థాయిలో ఎప్పటికప్పుడు గ్రీన్ అంబాసిడర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాలలో అందుబాటులో ఉంటూ సర్పంచ్‌లతో కలిసి సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రెడ్డయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
ఉత్తమ ఎన్‌ఎస్‌ఎస్
వలంటీర్‌గా శ్రీవాణి
రాజంపేట టౌన్ : రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ తృతీయ సంవత్సరం చదువుతున్న డి.శ్రీవాణి యోగివేమన యూనివర్సిటీ స్థాయిలో ఉత్తమ ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్‌గా ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.పురుషోత్తం, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎల్.రాజమోహన్‌రెడ్డి గురువారం ఇక్కడి విలేకరులకు తెలిపారు. యోగివేమన యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో వాణిశ్రీకి యూనివర్సిటీ వైస్ చాన్సలర్, ప్రొఫెసర్ బి.రాజశేఖర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.పద్మ, ఎన్‌ఎస్‌ఎస్ కో–ఆర్డినేటర్ ఎన్.వెంకటరామిరెడ్డి ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరించినట్లు తెలిపారు. శ్రీవాణి ఆరోగ్యం, పరిశుభ్రత, ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలు, మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలు తదితర అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించారన్నారు.

మోసంపై డీఎస్పీకి ఫిర్యాదు