
లారీని ఢీ కొన్న కంటైనర్
ఓబులవారిపల్లె : మండలంలోని అమృతవారిపల్లి జాతీయ రహదారి వద్ద గురువారం తెల్లవారుజామున ఎదురుగా వస్తున్న లారీని కంటైనర్ లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో లారీ ముందుభాగం దెబ్బతినడంతో డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. ఎస్‌ఐ పి.మహేష్ నాయుడు తన సిబ్బందితో ప్రమాద స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో లారీలో ఇరుక్కుపోయి ఉన్న డ్రైవర్‌ను బయటకు తీశారు. అనంతరం 108 వాహనంలో రైల్వేకోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాదు నుంచి చైన్నెకు వెళ్తున్న కంటైనర్ లారీ వేగంగా ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ విజయ్ కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పి.మహేష్ నాయుడు తెలిపారు.