
ఖాతాదారులకు మెరుగైన సేవలకే తొలి ప్రాధాన్యత
రాజంపేట టౌన్ : ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ తొలి ప్రాధాన్యత అని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కడప రీజియన్ హెడ్ అడపాల లక్ష్మీతులసి తెలిపారు. పట్టణంలోని అమ్మవారిశాల వద్ద ఉన్న యూనియన్ బ్యాంక్‌ను ఆర్‌ఎస్‌రోడ్డులోని చేజెర్ల కాంప్లెక్స్‌లోకి గురువారం మార్పు చేసిన సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ అన్ని రకాల సాంకేతిక సేవలు ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. తిరుపతి రీజియన్ హెడ్ శ్రీనివాసకుమార్ మాట్లాడుతూ ఖాతాదారులు సైబర్ నేరాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. రకరకాల లింక్‌లు సెల్‌ఫోన్‌కు వస్తుంటాయని అయితే కొత్తవారు పంపే లింక్‌లను ఎట్టిపరిస్థితుల్లో ఓపెన్ చేయవద్దని సూచించారు. కార్యక్రమంలో బ్యాంకు అధికారులు మొగితీశ్వర, వంశీకృష్ణ, ధనుంజయ, అబ్దుల్ లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.
యూనియన్ బ్యాంక్ రీజినల్ మేనేజర్
లక్ష్మీతులసి