
అభివృద్ధి మరచిన ప్రభుత్వం
రాయచోటి టౌన్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని సీపీఐఎంఎల్ లిబరేషన్ కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యుడు వి. శంకర్ విమర్శించారు. గురువారం రాయచోటి ఎన్జీఓ హోంలో సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాథ అధ్యక్షతన రాయలసీమ ముఖ్య కారకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే పనిలో ఉన్నారని ఆరోపించారు. రాష్ట్ర కార్యదర్శి డి. బంగార్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో కార్పొరేట్, మతతత్వ మనువాద శక్తులను అరికట్టకపోతే ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. డిసెంబర్ 6,7 తేదీలలో కడపలో నిర్వహించే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉదయ్ కిరణ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సిగి చెన్నయ్య, రఘునాథ నాయుడు, సుజాత, లవకుమార్ పాల్గొన్నారు.