
ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు ధోరణిలో సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై కేసులు పెట్టి వేధించడం తగదు. ఇలాంటి ఘటన ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిది. అలాగే జిల్లాలో కూడా సాక్షి జర్నలిస్టులపై పదేపదే పోలీసులు కేసులు పెట్టి ఏదో ఒకరకంగా వేధించాలనుకోవడం మంచి పద్ధతి కాదు. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైతే భవిష్యత్తులో ఉద్యమ కార్యచరణ రూపొందిస్తాం. – పి.రామసుబ్బారెడ్డి,
రాష్ట్ర నాయకుడు, ఆంధ్రప్రదేశ్ యూనియన్
ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్