
అబ్దుల్ కలామ్‌కు వైఎస్సార్‌సీపీ నాయకుల నివాళి
రాయచోటి అర్బన్ : రాష్ట్రపతిగా, క్షిపణి శాస్త్రవేత్తగా భారతదేశానికి విశిష్ట సేవలందించిన భారతరత్న ఏపీజే అబ్దుల్ కలామ్ జయంతి సందర్భంగా బుధవారం ఆయన విగ్రహానికి వైఎస్సార్‌సీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం అఽధ్యక్షుడు బేపారి మహమ్మద్ మాట్లాడుతూ కడు పేదరికంలో జన్మించినా పట్టుదలతో తాను కోరుకున్న జీవితాన్ని సాధించి, దేశానికి విజ్ఞానసంపదను అందించారని కొనియాడారు. ప్రతి విద్యార్థి అయన అడుగుజాడల్లో నడిచి రాణించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు శ్యామ్ కుమార్, షబ్బీర్ అహమ్మద్, అమీర్ ఖాన్, అజ్మతుల్లా, గౌస్ బేగ్, షేక్ మహమ్మద్, సమీర్ , పఠాన్, వసీం అహమ్మద్, ముబారక్, షౌకత్, ఫజీల్, అనీష్, సుబేల్, తౌఫిక్, జమీర్ అహమ్మద్ పాల్గొన్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా
అండర్–19 బాల బాలికల జట్లు ఎంపిక
మదనపల్లె సిటీ : ఉమ్మడి చిత్తూరు జిల్లా అండర్–19 బాల,బాలికల బాస్కెట్‌బాల్, హాకీ, హ్యాండ్‌బాల్, నెట్‌బాల్ జట్లను బుధవారం మదనపల్లె మండలం సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎంపిక చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. ఎంపిక కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్ ప్రారంభించారు. ఎంపికై న జట్లు రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ బాబు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి నాగరాజు, సెలక్షన్ కమిటీ సభ్యులు రెడ్డి శ్రీనివాస్, నరేష్, ఆసిఫ్, రియాజ్ పీడీలు ఉమాదేవి, ఉష, హరి, వేణు, యూసఫ్ తదితరులు పాల్గొన్నారు.
అండర్–19 హాకీ బాలికల జట్టు
అండర్–19 వాలీబాల్ బాల బాలికల జట్టు

అబ్దుల్ కలామ్‌కు వైఎస్సార్‌సీపీ నాయకుల నివాళి

అబ్దుల్ కలామ్‌కు వైఎస్సార్‌సీపీ నాయకుల నివాళి