
డ్రాపౌట్‌లను అరికట్టాలి
గాలివీడు : విద్యార్థుల హాజరుపై దృష్టి పెట్టి డ్రాపౌట్‌లను అరికట్టాలని సమగ్రశిక్ష ప్రత్యామ్నాయ స్కూల్ కోఆర్డినేటర్ ఉలవల వెంకట్రామయ్య సూచించారు. బుధవారం మండలంలోని పలు పాఠశాలలను ఆయన సందర్శించారు. అనంతరం విద్యార్థుల హాజరు రిజిస్టర్లు పరిశీలించి దీర్ఘకాలంగా గైర్హాజరైన, తరచుగా గైర్హాజరయ్యే విద్యార్థులను గుర్తించారు. అనంతరం ఆయన ఎఫ్ ఏ–2 పరీక్షల నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకం అమలు అంశాలను సమీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గైర్హాజరు విద్యార్థుల కోసం ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించి తల్లిదండ్రుల ద్వారా విద్యార్థి తిరిగి పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యా అధికారులు నాగరాజు, శ్రీనివాసులు, ప్రధానోపాధ్యాయులు జాఫర్ బాషా, కృష్ణానాయక్, రమణారెడ్డి, వెంకటయ్య, సీఆర్పీలు సాంబశివ, భరత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.